బతుకమ్మ, కోటగిరి : కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ నలంద స్కూల్లో ప్రెస్ మీట్ ఏర్పటి చేశారు. ఈ సందర్బంగా సిపిఐ పార్టీ బాన్సువాడ నియోజకవర్గం ఇన్చార్జి దుబాస్ రాములు కోటగిరి సిపిఐ మండల కార్యదర్శి ఏ విటల్ గౌడ్ మాట్లాడుతూ… కోటగిరి గ్రామంలో ప్రస్తుతం బస్టాండు లేక ప్రజలు విద్యార్థులు మహిళలు చిన్నపిల్లలు ఎంతో ఇబ్బంది గురవుతున్నప్పటికీ మరి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం కోటగిరి బస్టాండు ప్రజలకు చాలా అవసరమని నిలువ నీడ లేక బస్సులు వచ్చేవరకు రోడ్డుపై నిలబడి ఇబ్బందులకు గురవుతున్నారని ప్రస్తుతం వర్షాకాలం మొదలవుతుందని కోటగిరి గ్రామంలో పాలిటెక్నికల్ కాలేజీ జూనియర్ కాలేజీ ప్రవేట్ స్కూల్స్ విద్యార్థులు నిత్యం ప్రజలు వేళల్లో పయనిస్తున్నారు కనీసం మహిళలకు మూత్రశాలలు లేకపోవడం ఇది ఎంత సిగ్గుచేటు అని అన్నారు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు డబ్బులు వచ్చిన పనులు చేస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు ఎందుకు చేయలేకపోతున్నారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కోటగిరి దత్తత తీసుకున్న గ్రామంలో బస్టాండు లేకపోవడం ఎంత సిగ్గుచేటని కనీసం ఇప్పటికైనా స్థానిక ఉన్న ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఆత్మ విమర్శన చేసుకొని ప్రజలకు అవసరమైన బస్టాండ్ నిర్మించి ప్రజలను కష్టాలను తొలగించాలని లేనివేడల దశలవారీగా బస్టాండ్ నిర్మించే వరకు ఉద్యమాలు కొనసాగుతాయని సిపిఐ డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నల్ల గంగాధర్ శంకర్ ప్రసాద్ గూడుమియా గజేందర్ శివ మారుతి ఇమ్రాన్ నారాయణ గుడాల రాములు తదితరులు పాల్గొన్నారు.
