26.2 C
Hyderabad
Monday, August 3, 2026

సంజీవని హాస్పిటల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, కోటగిరి : కోటగిరి మండల కేంద్రంలోని సంజీవని హాస్పిటల్ లో బోధన్ లైన్స్ క్లబ్ భవాని సభ్యులు అభయ హస్తం ఫౌండేషన్ నిర్వాహకులు బర్ల మధుకర్ జన్మదిన సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ నిజామాబాద్ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.  25 మంది రక్తదానం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్  అధ్యక్షులు బుస్స ఆంజనేయులు, బోధన్ డివిజన్ రెడ్ క్రాస్ అధ్యక్షులు లయన్ బసవేశ్వర రావు, రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, జిల్లా రెడ్ క్రాస్ కార్యవర్గ సభ్యులు గోగినేని హనుమంతరావు, ఏఎంసీ చైర్మన్ గైక్వాడ్ హనుమంతు, ఎంపీటీసీ కొట్టం మనోహర్, మాజీ సర్పంచ్ స్వరూప , మండల రెడ్క్రాస్ అధ్యక్షులు అంగర్గా వెంకటేశం, రెడ్ క్రాస్ సభ్యులు బర్ల రవి, లైన్స్ క్లబ్ ఆఫ్ భవాని పావులూరి వెంకటేశ్వరరావు, గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article