- ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి
భీమ్ గల్, బతుకమ్మ : ప్రభుత్వ కళాశాలల్లో నిష్ణాతులైన భోధన సిబ్బంది ఉంటుందని తద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యా లభిస్తుందని భీమ్ గల్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి అన్నారు. బుధవారం భీమ్ గల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల ప్రభుత్వం అందిస్తున్న పాఠ్య పుస్తకాలను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వ కళాశాలాల్లో అనుభవం ఉన్న అధ్యాపకులు ఉంటారని, ఉచితంగా విద్యను అందించడం జరిగితుందని అన్నారు. తల్లిదండ్రులు అందరు తమ పిల్లల్ని ప్రచారాలకు మోసపోయి డబ్బులు వృధా చేసుకోకుండా మీ మీ పిల్లల్ని ప్రభుత్వ కాలేజిల్లోనే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమం లో కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
