30.9 C
Hyderabad
Monday, August 3, 2026

డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

…  కామారెడ్డి ఏఎస్ పి బి. చైతన్య రెడ్డి

 భిక్కనూరు ,బతుకమ్మ :

డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కామారెడ్డి ఎ.ఎస్.పి చైతన్య రెడ్డి తెలిపారు. బుధవారం భిక్కనూరు గంజి చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి యువతకు మత్తు మాదకద్రవ్యాలు వంటివి జోలికి వెళ్ళవద్దని వాటికి దూరంగా ఉండాలన్నారు యువత ఇటువంటి చెడు వ్యసనాల అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. జిల్లాలో గంజాయి మత్తు పదార్థాల వంటి వాటిని అరికట్టడానికి పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోందని తెలిపారు యువత చెడు వ్యసనాలు వైపు వెళ్లకుండా మంచి నడవడికతో డ్రగ్స్ రహిత జిల్లాగా నిర్మిద్దామని పిలుపునిచ్చారు. కామారెడ్డి గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ యువతకు ఉద్యోగ ఉపాది అవకాశాలు లభిస్తే ఇటువంటి వాటి పైకి ఆలోచన ఉండదు అన్నారు ప్రధానంగా నిరుద్యోగ సమస్యతో యువత మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారని తెలిపారు .ఈ మధ్యకాలంలో చదువుకుంటున్న విద్యాసంస్థల కేంద్రాలుగా డ్రగ్స్ గంజాయి వంటివి నడుస్తున్నాయన్నారు. కామారెడ్డి జిల్లాలో భారీ పరిశ్రమలు వచ్చి యువతకు ఉద్యోగ ఉపాది అవకాశాలు లభిస్తే ఈ ప్రాంతం అభివృద్ధితో పాటు యువత చెడు వ్యసనాల వంటివి వైపు వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంద్రకరణ్ రెడ్డి ఎంఈఓ రాజ్ గంగారెడ్డి, సిఐ సంపత్ కుమార్ ఎస్సైలు ఆంజనేయులు, పుష్ప రాజ్, స్రవంతి, డాక్టర్ హేమీమా విద్యార్థులు పాల్గొన్నారు.

Everyone should work towards a drug-free society.

More articles

Latest article