28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏం సాధించారని రైతు సంబరాలు చేసుకుంటున్నారు

Must read

📰 Generate e-Paper Clip

  • రైతుల్ని నమ్మిచ్చి మోసం చేసినందుకా
  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ : ఏం సాధించారని రైతు సంబరాలు చేసుకుంటున్నారు.. రైతుల్ని నమ్మిచ్చి మోసం చేసినందుకా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. రైతును రాజును చేయాలన్న ఉద్దేశ్యంతో పంటకు పెట్టు బడి సాయంగా కేసీఆర్ రైతు బంధు ఈ పథకాన్ని ప్రారభించారన్నారు. కేసీఆర్ గత 9 ఏండ్లలో రైతు బంధు ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో 11 విడతల్లో సుమారు 75,000 కోట్లు జమ చేసాడు ..కానీ ఏనాడు మీలాగా ఇంత హంగామా చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటి సారి ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా ఎకరానికి 7500 కాకుండా 5000 ఇచ్చి, రెండో విడతా పూర్తిగా ఎగ్గొట్టి,మూడో పంటకు 4 ఎకరాల పైన ఉన్న రైతులందరికీ ఎగ్గొట్టినందుకు సంబరాలు చేసుకోవాలా..? సగం మంది రైతులకు 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినందుకు సంబరాలు చేసుకోవాలా..?  అన్ని రకాల వడ్లకు బోనస్ అని చెప్పి ఇప్పుడు సన్నాలకు అని మాటమార్చి బోనస్ ఎగ్గొట్టినందుకా..?  వరంగల్ రైతు డిక్లరేషన్  ఆటకెక్కించినందుకా ? రైతు భీమా ప్రీమియం కట్టనందుకా..? కౌలు రైతులకు ఇస్తానన్న రైతు భరోసా ఇంకా అమలు చేయనందుకా..? అని ప్రశ్నించారు. కేవలం స్థానిక సంస్థల  ఎన్నికలు ఉన్నాయని రైతు భరోసా వేసి సంబరాలు చేస్తున్నారన్నారు.  రైతు సంబరాల్లో పిలిచిన రైతులెవ్వరు పాల్గొనటం లేదని తెలిపారు. ఇది ఎన్నికల స్టంట్ గానే రైతులు చూస్తున్నారన్నారు. ఇప్పటికైనా సంబరాల పేరిట ఎన్నికల డ్రామాలు ఆపి రైతుల కిచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎగ్గొట్టిన రైతు భరోసా వెంటనే ఇవ్వాలని, అందరూ రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేయాలని, అన్ని రకాల వడ్లకు పాత సీజన్ లతో సహా రూ. 500 బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలని రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.

More articles

Latest article