ఏం సాధించారని రైతు సంబరాలు చేసుకుంటున్నారు
రైతుల్ని నమ్మిచ్చి మోసం చేసినందుకా మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : ఏం సాధించారని రైతు సంబరాలు చేసుకుంటున్నారు.. రైతుల్ని నమ్మిచ్చి మోసం చేసినందుకా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. రైతును రాజును చేయాలన్న ఉద్దేశ్యంతో పంటకు పెట్టు బడి సాయంగా కేసీఆర్ రైతు బంధు ఈ పథకాన్ని ప్రారభించారన్నారు. కేసీఆర్ గత 9 ఏండ్లలో రైతు బంధు ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో 11 విడతల్లో సుమారు 75,000 కోట్లు...