25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

అంతా నా ఇష్టం.. నన్ను ఎవరేమంటారు..

Must read

📰 Generate e-Paper Clip

  • పాఠ్యపుస్తకాల పేరుతో ఉపాధ్యాయుడు విధులకు డుమ్మా
  • ఉపాధ్యాయుడికి వత్తాసు పలికిన ప్రధానోపాధ్యాయురాలు

 

రుద్రూర్, బతుకమ్మ:  అంతా నా ఇష్టం.. నాకెవరేమంటారు అన్న చందంగా మారింది ఓ ఉపాధ్యాయుని వ్యవహార శైలి. విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే పాఠ్యపుస్తకాల పేరుతో విధులకు డుమ్మా కొట్టడం పరిపాటిగా మారింది. రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రుద్రూర్ గ్రామానికి చెందిన వంజరి రమేష్ అనే ఉపాధ్యాయుడు చిక్కడపల్లి  గ్రామంలోని ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నాడు.  విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు తీసుకొస్తానని మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రానికి వెళ్తున్నానని చెప్పి తన ఇంటి వద్ద సొంత పనుల్లో నిమగ్నమయ్యాడు. అక్కడే ఉన్న ప్రధానోపాధ్యాయురాలుకు  అడగగా పొంతన లేని సమాదానాలను ఇచ్చింది. మీరెవరు జర్నలిస్టులకు  లోనికి ఎంట్రీ లేదని బదులిచ్చింది. అంతేకాకుండా ఆ డుమ్మా కొట్టిన ఉపాధ్యాయుడికి వత్తాసు పలికింది. రుద్రూర్ ఎంఈవో కట్టా శ్రీనివాస్ కు చరవాణిలో విషయాన్ని వివరించగా నోట్స్ బుక్స్ కోసం మా వద్దకు అతను రాలేడని  సమాధానమిచ్చాడు. ఇప్పుడిప్పుడే పిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల పైన నమ్మకం పెరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి ఉపాధ్యాయులతో ఉన్న నమ్మకం కాస్త పోయేలాగా ఉంది. విధులకు ఎగనామం పలుకుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును నీరుగార్చేలా వ్యవహరిస్తున్న ఇలాంటి ఉపాధ్యాయులపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై ఎం ఈ ఓ శ్రీనివాస్ ను వివరణ కోరగా ఉదయం నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నేను విద్యావనరుల కేంద్రం లోనే ఉన్న సమయంలో అతను బుక్స్ కోసం రాలేదు ఒకవేళ వచ్చిన అరగంటలో బుక్స్ తీసుకుని స్కూల్ కి వెళ్లలే కానీ ఇంటికి వెళ్ళరాదు అని తప్పకుండా ఆతని పై చర్యలు తీసుకుంటానని తెలిపారు.

More articles

Latest article