29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

గోల్డ్ మెడల్ ఛాంపియన్ నేహాను అభినందించిన ఎమ్మెల్యే

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ఇటీవల కాజఖస్తాన్ లో జరిగిన  వరల్డ్ గ్రాప్పింగ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ సాధించిన షేక్ నేహాను  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. సోమవారం గోల్డ్ మెడల్ సాధించిన షేక్ నేహా నిజామాబాద్ రావడంతో  నిజామాబాద్ నియోజకవర్గ  బూర్గం పి గ్రామం చౌరస్తా వద్ద  ఏర్పాటుచేసిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొని  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , నిజామాబాద్ నియోజకవర్గం మంచిప్ప గ్రామానికి చెందిన షేక్ నేహా వరల్డ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మరియు సిల్వర్ బహుమతులు రావడం వల్ల  నిజాంబాద్ రూరల్ నియోజకవర్గానికి గర్వంగా ఉందని అన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  క్రీడలను  ఎంతో ప్రోత్సహిస్తున్నారని అన్నారు. తెలంగాణ క్రీడాకారులు ఒలంపిక్స్ లలో  ఆడి బహుమతులు పొందాలని అన్నారు. షేక్ నేహా కు  ట్రైనింగ్ ఇచ్చిన  కోచ్ కి, తల్లిదండ్రులను అభినందించారు. షేక్ నేహా కు  శాలువా కప్పి, సన్మానించి పదివేల నగదును  నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే  రేకులపల్లి భూపతిరెడ్డి  ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, నిజాంబాద్ రూరల్ మండలం మాజీ ఎంపీపీ  యాదగిరి, యువజన నాయకులు ఉమ్మజీ నరేష్, మోపాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  సాయి రెడ్డి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అధ్యక్షుడు తూంపల్లి మహేందర్, చామకూర ఆకాశరెడ్డి, రాజేష్, కాల్పోల్ వంశీ  తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article