29.9 C
Hyderabad

ఏర్గట్ల ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షునిగా రేండ్ల రవి నియామకం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: మండల ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షునిగా ఏర్గట్ల గ్రామానికి చెందిన రేండ్ల రవి ని నియమించినట్లు నిజామాబాద్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కరాటే రమేష్ కుమార్ తెలిపారు. శనివారం రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని సంఘ భవనంలో నియామకపు పత్రాన్ని అందజేశారు. ఇట్టి సందర్భంలో మండల అధ్యక్షునిగా నియమించబడ్డ రేండ్ల రవి,జిల్లా అధ్యక్షునికి పూలమాల శాలువాతో సన్మానం చేసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి జక్కం అశోక్ ముదిరాజ్, సంఘం అధ్యక్షులు, దొబ్బల పెద్ద కిషన్, జుంగల శ్రీను, ఈర పట్నం నరసయ్య, నిమ్మన గంగయ్య, ఏర్గట్ల మండల మాజీ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు జుంగల పెద్ద గంగారం( బిగ్ బాస్ ) పాల్గొన్నారు.

More articles

Latest article