30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

చేయి చేయి కలుపుదాం.. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

Must read

📰 Generate e-Paper Clip

  • భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు 

 

బతుకమ్మ, భిక్కనూరు: కామారెడ్డి ఎస్పి రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు డ్రగ్స్ రహిత సమాజం కోసం తమతో ప్రతి ఒక్కరూ సహకరించాలని భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు  అన్నారు.  శుక్రవారం సిద్ధ రామేశ్వర నగర్ గ్రామంలోని గురుకుల పాఠశాలలో ఎస్సై తమ సిబ్బందితో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం  ఎస్సై ఆంజనేయులు మాట్లాడుతూ  విద్యార్థులు ,యువత మత్తుకు బానిసలుగా మారి తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు అన్నారు. మత్తు పదార్థాలను వినియోగించడం సరఫరా చేయడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. అత్యధిక శాతం విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని చెడు మార్గంలో వెళ్లొద్దని సూచించారు. ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్న విక్రయించినట్లు తెలిసిన పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రఘు, ఉపాధ్యాయులు ,పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Let's join hands and build a drug-free society.

More articles

Latest article