30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

మొక్కలు నాటిన ఏర్గట్ల పాఠశాల ఉపాధ్యాయులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల : పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ఏర్గట్ల ఉన్నత పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు సుమారు 30కి పైగా వేప చెట్లు, కానుగ చెట్లను నాటారు. పాఠశాల ఆవరణ పచ్చదనంతో పాటు భవిష్యత్తులో చక్కని నీడను, చల్లని గాలిని అందించడం కోసం ఈ చెట్లను నాటడం జరిగిందని, వీటి సంరక్షణ కోసం ట్రీ గాడ్స్ నీ కూడా ఏర్పాటు చేస్తున్నామని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు  కృష్ణాచారి తెలిపాడు. విద్యార్థులు ఈ మొక్కలకు ప్రతినిత్యం నీటిని అందించాలని, వాటి సంరక్షణ కోసం పిల్లలతో కమిటీని కూడా ఏర్పాటు చేసి, ఆ మొక్కల బాగోగులు విద్యార్థులకు అప్పచెప్పడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మునిరుద్దీన్, ప్రసాద్, పవన్, రాజశేఖర్, శ్రీనివాస్, ప్రవీణ్ శర్మ, గంగాధర్, రాజనర్సయ్య, గంగా మోహన్, ట్వింకిల్, జ్యోతి, సబితా పాల్గొన్నారు.

More articles

Latest article