25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

నర్సింగ్ కళాశాలను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ : రూ. 40 కోట్లతో బాన్సువాడ నియోజకవర్గం, నసరుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివారులో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ కళాశాల భవన సముదాయ పనులను త్వరితగతిన పూర్తి చేసి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని తన నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ కళాశాల భవన సముదాయ పనులపై సంబంధిత అధికారులతో, కాంట్రాక్టర్ తో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భాం ఆయన మాట్లాడారు.  బాన్సువాడను విద్య, వైద్య రంగానికి హబ్ గా తీర్చిదిద్దుతున్నామనితెలిపారు. ఈ నర్సింగ్ కళాశాలను బాలికలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాలికలకు విద్య ఎంతో అవసరం, విద్యతోనే సామాజికంగా, ఆర్థికంగా మార్పు వస్తుందని  తెలిపారు.

Nursing college should be made available soon

More articles

Latest article