28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలి

Must read

📰 Generate e-Paper Clip

  • కార్మికవర్గ రాజ్యస్థాపనే టియుసిఐ లక్ష్మం
  • టియుసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్. ఎల్ పద్మ

 

సిరికొండ, బతుకమ్మ :  శ్రమజీవులంతా  సంఘటితమై సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని,కార్మిక వర్గ రాజ్యస్థాపనే ద్యేయంగా టియుసిఐ లక్ష్మంగా పనిచేస్తోందని టియుసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్. ఎల్ పద్మ అన్నారు.  గురువారం  ట్రేడ్ యూనియన్ సెంటర్ అప్ ఇండియా (టియుసిఐ)నిజామాబాద్ రూరల్ aకామారెడ్డి సంయుక్త జిల్లా ప్రథమ మహాసభ లను సిరికొండ మండల కేంద్రం లోని కామ్రేడ్. ఎం. రాజేందర్ నగర్ ( ఎంఎన్ పంక్షన్ హాల్)లో నిర్వహించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతు దేశంలో శ్రమజీవుల శ్రమను దోపిడీ చేస్తు యాజమాన్యాలు కుబేరులవుతున్నారన్నారు. పాలక వర్గాలు కార్మిక వర్గాన్ని దోపిడీ చేసే కోటీశ్వర్ల కొమ్ముఖాస్తు నిలువుదోపిడీ చేస్తున్నారన్నారు. అదాని, అంబానీ ల మోచేతి నీళ్లు త్రాగుతు కార్మికులను బలిపశువులను చేసే లేబర్ కోడ్స్ ను కేంద్రం తీసుకొని రావడం సిగ్గుచేటు అన్నారు. ఈ ప్రాంతం లో బీడీ కార్మికులు,జి.పి వర్కర్స్  ప్రధానమైన కార్మిక రంగం ఉందని, కార్మికుల పక్షాన టియుసిఐ  సమరసియుల పోరాటం నిర్వహిస్తుందన్నారు. టి యు సి ఐ  దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో నిర్మాణం కలిగి దేశకార్మికవర్గంలోనే బలమైన కార్మిక సంఘంగా ఉందన్నారు. అన్నిరకాల సంఘటిత, అసంఘటీత కార్మికులను ఐక్యం చేస్తు విప్లవ కార్మిక సంఘంగా ముందుకు వెళ్తుంది అన్నారు. అంతిమంగా కార్మిక వర్గ రాజ్యస్థాపనే లక్ష్యంగా పనిచేస్తుంది అన్నారు.

We need to be prepared for militant struggles.

More articles

Latest article