26.2 C
Hyderabad
Monday, August 3, 2026

భర్తను చంపిన భార్య

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో రైతు బీమా డబ్బుల కోసం అన్నదమ్ముల తో కలిసి కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ భార్య. ఈ సంఘటన పిట్లం మండలం లోని సిద్దాపూర్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. లింగంపేట్ మండలం మాలోత్ తాండా కు చెందిన బాదావత్ లాల్ సింగ్(44) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆటో సారిగా నడవక మద్యానికి బానిస అయ్యాడు. దీంతో విసుగు చెందిన భార్య సుశీల తన అన్నదమ్ముల తో కలిసి హతమార్చింది. శుక్రవారం తన భర్త లాల్ సింగ్ ను తీసుకొని పిట్లం మండలం లోని తన తల్లి గ్రామానికి తీసుకెళ్ళింది. అక్కడ తన భర్త తో ఫుల్ గా మద్యం తాగించింది. తన అన్నదమ్ముల సహాయంతో భర్తను చంపి అక్కడే వదిలేసి శనివారం తాండ కు వచ్చింది. తన భర్త అదృశ్య మైనట్లు తండ వాసులని నమ్మించే ప్రయత్నం చేసింది. తాండా వాసులకు అనుమానం వచ్చి నిలదీయగా తానే భర్తను హతమార్చినట్లు ఒప్పుకుంది. దీంతో తాండా వాసులు సుశీలను లింగంపేట పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article