29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్సై పి.సాయన్న సూచించారు. గురువారం రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో మాదకద్రవ్యాల నిర్మూలనకై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, సదస్సు, ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగంతో యువత జీవితాలు నాశనం అవుతాయని అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంపై పోలీస్ శాఖకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

More articles

Latest article