25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఫిర్యాదుదారు వద్దకే పోలీస్ కమిషనర్

Must read

📰 Generate e-Paper Clip

  • వృద్ధురాలు వద్దకు వెళ్లి సమస్య విన్న కమిషనర్
  • వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని ఆదేశాలు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీస్ కమిషనర్ క్యాంప్ కార్యాలయానికి వృద్ధురాలు తన గోడు వినిపించుకోవడానికి మంగళవారం పోలీస్ క్యాంప్ కార్యాలయానికి వచ్చింది. సాయంత్రం సమయంలో అప్పుడే అటువైపు నుంచి క్యాంపు కార్యాలయానికి వస్తున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య వృద్ధిరాలిని చూసి తన కారులో నుంచి దిగి త్వరితగతిన ఆ  వృద్ధురాలు వద్దకు వెళ్లి  ఫిర్యాదును తీసుకొని ఆమె సమస్యను క్షుణ్ణంగా విన్నారు. ఆ వృద్ధురాలు పేరు యాదమ్మ.  ఆర్మూర్ ప్రాంతానికి చెందింది. ఆమెపై పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని తమ సమీప బంధువులు దాడి చేశారని కమిషనర్ సాయి చైతన్యకు తెలిపింది. వెంటనే స్పందించిన కమిషనర్ ఈ వృద్ధురాలి సమస్యని త్వరితగతిన పరిష్కరించాలని ఆర్మూర్ ఎస్ఎచ్ఓకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కమిషనర్ సాయి చైతన్య స్పందించిన తీరు పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Police Commissioner at the complainant's place

More articles

Latest article