27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

Must read

📰 Generate e-Paper Clip

సిరి పిల్లల హస్పీటల్.. తపస్ ల సంయుక్త అధ్వర్యంలో

కమ్మర్ పల్లి, బతుకమ్మ:

కమ్మర్‌పల్లీ మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో మెట్‌పల్లికి చెందిన సిరి పిల్లల హాస్పిటల్,  తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఆదివారం జరిగిన ఉచిత వైద్య శిబిరంలో పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ చిలుక చైతన్య సుమారు 80 మందికి పైగా పిల్లలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చిలుక చైతన్య మాట్లాడుతూ… నవజాత శిశువు నుండి 14 సంవత్సరాల వయసు వరకు శారీరకంగా, మానసిక ఆరోగ్య కరమైన పెరుగుదల ముఖ్యం అని అన్నారు.  ప్రస్తుతం వర్షాకాలంలో సీజనల్, వైరస్ వ్యాధుల ముప్పు పొంచి ఉందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సొంత గ్రామంలో ఉచితంగా వైద్య సేవలు అందించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్న డాక్టర్ చిలుక చైతన్యకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సన్మానం  చేసి కృతజ్ఙతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో  ఎఏంసీ వైస్ చైర్మన్ సుంకేట్ బుచ్చన్న, గ్రామ కమిటీ అధ్యక్షులు రామస్వామి తపస్ అధ్యక్షుడు కిషన్, సెక్రటరీ రమేష్, శంకర్, రామకృష్ణ రెడ్డి, కిషన్ రెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు.

Extraordinary response to free medical camp

More articles

Latest article