బాన్సువాడ బతుకమ్మ :
తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు రోడ్డెక్కారు. మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని బుడగ జంగాల కాలనీ ప్రజలు గత వారం రోజులుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు శనివారం బోధన్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. ఈ నిరసనతో ఇరువైపులా పెద్దఎత్తున వాహనాలు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిరది. సమాచారం అందుకున్న ఎస్సై శివకుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని మహిళలను సముదాయించారు. పంచాయతీ అధికారులతో మాట్లాడి తాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
