27.7 C
Hyderabad

మరో ఐదు రోజుల పాటు వానలు

Must read

📰 Generate e-Paper Clip

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం

హైదరాబాద్, బతుకమ్మ:  తెలంగాణలో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించడంతో వర్షాలు కురుస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో ఐదు రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురువనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ విభాగం వెల్లడించింది. గంటకు 40 – 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, వికారాబాద్ జిల్లాలో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉందని తెలిపింది. హైదరాబాద్ లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

More articles

Latest article