32.7 C
Hyderabad

అక్రమంగా భూమి చదును చేస్తున్న జేసీబీ సీజ్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ : నాగిరెడ్డిపేట : అడవిలో అక్రమంగా భూమిని చదును చేస్తున్న జెసిబి ని పట్టుకుని సీజ్ చేసినట్లు మండల అటవీ శాఖ అధికారి వాసుదేవ్ తెలిపారు. బుధవారం నాగిరెడ్డిపేట రేంజ్ పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్ కంపార్ట్ మెంట్ నెంబర్ 742 లో ఎర్రకుంట తండా శివారులోని అడవిలో కొంతమంది వ్యక్తులు మెదక్ జిల్లాకు చెందిన ఓ జెసిబి తో ముళ్లపొదలు తొలగిస్తూ, భూమిని చదును చేస్తున్నారన్న సమాచారం మేరకు సంఘటన స్థలానికి అటవీ శాఖ సిబ్బందితో కలిసి వెళ్లిచూడగా జెసిబి డ్రైవర్ పరారీ అయ్యాడన్నారు. దీంతో అక్రమంగా భూమిని చదును చేస్తున్న జెసిబి ని అదుపులోకి తీసుకొని సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎఫ్ఆర్వో వాసుదేవ్ తెలిపారు.

More articles

Latest article