24 C
Hyderabad
Sunday, August 2, 2026

వీధి కుక్కల దాడిలో బాలునికి తీవ్రగాయాలు

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా,బతుకమ్మ: వీధి కుక్క దాడిలో ఓ బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మెండోరా మండలం సావెల్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఒడ్డే.రాములు కుమారుడు ఆకాష్(11) ఇంటి బయట ఆడుకునేందుకు వెళ్తుండగా అటువైపుగా వస్తున్న కుక్క వెంబండించి కిందపడేసి బాలుడి పై పైశాచికంగా విచక్షణ రహితంగా దాడి

Boy seriously injured in attack by stray dogs

చేసి కొరికింది. బాలుడికి  ముఖం, చేయి, కాళ్ల పై తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాలుడిని కాపాడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిర్మల్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల గ్రామంలో కుక్కల బెడద ఎక్కువైందని చిన్న పిల్లలు పెద్దలు సహితం బయటికి వెళ్ళాలన్నా భయపడుతున్నారని కాలని వాసులు వాపోతున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Boy seriously injured in attack by stray dogs

More articles

Latest article