27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

చెట్టుకొమ్మ విరిగిపడి లైన్ మన్ మృతి

Must read

📰 Generate e-Paper Clip

నాలుగో టౌన్ పరిధిలో ఘటన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  నగరంలోని వినాయక్ నగర్ లోని  ఫూలాంగ్ ప్రాంతంలో చెట్టు కొమ్మ విరిగిపడి విద్యుత్ శాఖ లైన్ మన్ మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. నగరంలోని బోర్గాం( పి )ప్రాంతం సంజీవరెడ్డి నగర్ కు చెందిన శ్రీనివాస్ విద్యుత్ శాఖలో లైన్ మన్ గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఆ సమయంలో శ్రీనివాస్ స్థానికంగా ఉన్న ఒక షెడ్డు వద్ద ఆశ్రయం తీసుకోగా.. అక్కడ ఉన్న చెట్టు నుంచి కొమ్మ విరిగిపడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

More articles

Latest article