24.1 C
Hyderabad
Monday, August 3, 2026

బాగిర్తి పల్లి లో మహిళ హత్య..

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు :

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం భాగిర్తి పల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో  వివాహిత మహిళా హత్య జరిగింది. ఈ సంఘటన  శుక్రవారం ఉదయం జరిగింది..వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన యేసు మని (42) ని  సోంత మరిది సురేష్ పదునైన ఆయుధంతో పోడిచి హత్య చేసినట్లు తెలిసింది. తండ్రికి ఆనారోగ్యంతో బాదపడుతుండగా వైధ్యం కొసం తాను ఓక్కడినే డబ్బులు ఖర్చు చేస్తుండగా అన్న రాములు ద్వార రావాలిసిన డబ్బులు వదిన ఇవ్వకపోవడమే కాకుండా తనను ఇష్టం వచ్చినట్లు తిట్టడంతో ఈ హత్య చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. హత్య విషయం తెలుసుకున్న భిక్కనూర్ సిఐ సంపత్ ఎస్ఐ సాయికుమార్ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో హత్య జరగడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకోన్నాయి. పోలిస్ లు బారీ బందోబస్తు ఎర్పాటు చేశారు.

 

More articles

Latest article