23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

తండ్రి మందలించాడని పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం,  బతుకమ్మ : నిర్మల్ జిల్లా నరసాపురం గ్రామానికి చెందిన సిందే శివకుమార్ (17)  నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో రెండవ సంవత్సరం చదువుతున్నాడు. అయితే సెకండ్ సెమిస్టర్ లో రెండు సబ్జెక్టులు, థర్డ్ సెమిస్టర్ లో రెండు సబ్జెక్టులు, ఫోర్త్ సెమిస్టర్ లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. ఈ విషయంపై  మంచిగా చదువుకోమని తండ్రి మందలించారు. వారం క్రితం సప్లమెంటరీ పరీక్షలు రాయడానికి నిజామాబాద్ వచ్చాడు. అయితే  ఈ నెల 6  మధ్యాహ్నం  తాను ఉంటున్న హాస్టల్ నుంచి  దాస్ నగర్ గ్రామ శివారు కు వచ్చి గడ్డి మందు తాగి తిరిగి హాస్టల్ కు వెళ్లగా అక్కడ వాంతి చేసుకొన్నాడు. అతని స్నేహితులు గమనించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు మాక్లూరు ఎస్సై తెలిపారు.

More articles

Latest article