29 C
Hyderabad
Monday, August 3, 2026

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ దోమకొండ – దోమకొండ మండల కేంద్రంలో ఒకరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మండల కేంద్రానికి చెందిన గజం సత్యం కూలి పనికి అంచనూర్ గ్రామానికి వెళుతుండగా హెచ్ పి పెట్రోల్ పంపు దగ్గర కారు వెనుక నుండి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయాన్నారు. చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సత్యం మరణించాడని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

More articles

Latest article