29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

మెదడు ఇచ్చే సంకేతాలను విస్మరించకండి

Must read

📰 Generate e-Paper Clip

మెడికవర్ ఆసుపత్రి, ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీకృష్ణదిత్య సూచన

ఈనెల 8న ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం

నిజామాబాద్, బతుకమ్మ :  మనిషి మెదడు ఇచ్చే సంకేతాలను విస్మరించొద్దని మెడికవర్ ఆసుపత్రి, ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీకృష్ణదిత్య సూచిస్తున్నారు. ఈనెల 8న ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం సందర్భంగా ఆయన పలు సలహాలు తెలియజేశారు.  నిత్యం మనం తలనొప్పిని , మతిమరుపును, వయసు ప్రభావంగా కళ్లు తిరగడాన్ని, అలసటను తేలికగా తీసుకుంటామన్నారు. ఒక్కోసారి ఈ సాధారణ లక్షణాలే మన మెదడులోని ఒక తీవ్రమైన సమస్యకు సంకేతాలు కావొచ్చు అంటున్నారు. బ్రెయిన్ ట్యూమర్  వ్యాధి గురించి అవగాహన పెంచాలన్నారు. తద్వారా లక్షణాలను ముందుగానే గుర్తించి, సకాలంలో చికిత్స అందించొచ్చు అన్నారు.  బ్రెయిన్ ట్యూమర్లు అరుదైనవి కావని,  ఇవి పిల్లల నుండి వృద్ధుల వరకు ఎవరికైనా రావొచ్చు అన్నారు. ముఖ్యంగా, ప్రారంభ లక్షణాలు తరచుగా ఇతర సాధారణ ఆరోగ్య సమస్యలుగా కనిపించి, తర్వాత క్లిష్టమైన వాటిగా దారితీస్తాయన్నారు. సరైన సమయంలో గుర్తించి చికిత్స అందిస్తే,  విలువైన ప్రాణాలను కాపాడ వచ్చన్నారు. ఒక చిన్న స్కాన్, ఒక సరైన వైద్య నిర్ణయం జీవితాన్ని, ఒక కుటుంబ భవిష్యత్తును పూర్తిగా మార్చగలదని సూచించారు. మెడికవర్ న్యూరో సైన్సెస్ వద్ద, బ్రెయిన్ ట్యూమర్‌ను కేవలం ఒక వ్యాధిగా కాకుండా, రోగికి కొత్త జీవితాన్ని ప్రసాదించే అవకాశంగా చూస్తామన్నారు. నిపుణులైన వైద్యులు అధునాతన ఎంఆర్ఐ, న్యూరో-నావిగేషన్ సిస్టమ్స్, మినిమల్ ఇన్వాసివ్ సర్జరీ, మరియు రోబోటిక్ సర్జరీ వంటి అత్యాధునిక పద్ధతులను ఉపయోగించి, రోగులకు సురక్షితమైన, వేగవంతమైన కోలుకునే చికిత్సను అందిస్తున్నామన్నారు. మా బహుళ-విభాగాల సంరక్షణ (Multi-disciplinary care) కేవలం శరీరానికి మాత్రమే కాకుండా, రోగి మానసిక స్థితికి కూడా మద్దతునిస్తుందన్నారు. కావున అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు.

More articles

Latest article