24.1 C
Hyderabad
Monday, August 3, 2026

భిక్కనూరులో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని గిద్ద హరిజనవాడలో ఇల్లులేని లబ్ధిదారులకు ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ షబ్బీర్ అలీ  శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ లబ్ధిదారులకు విడుతల వారీగా 5 లక్షల సాయం అందజేస్తారన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్న పేదలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టి ఇవ్వడం జరుగుతుందన్నారు.కామారెడ్డి నియోజకవర్గం లో 3028 మంది లబ్ధిదారులకు ఎంపిక చేయడం జరిగిందన్నారు త్వరలో 472 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం స్కామ్లు కమిషన్లలు కబ్జాలు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్రష్టు పట్టించిన బిఆర్ఎస్ పార్టీ అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి గ్రంథాల సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమ్ రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి శ్రీరామ్ వెంకటేష్ ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Bhoomi puja for Indiramma's houses in Bhikkanur

More articles

Latest article