28.8 C
Hyderabad
Monday, August 3, 2026

కాళేశ్వరం సమాచారం అంతా కేసీఆర్, హరీష్ రావు వద్దే..

Must read

📰 Generate e-Paper Clip

రాజకీయ ప్రయోజనాలకు కాళేశ్వరం అంశాన్ని వాడుకోవద్దు

బాధ్యులను కఠినంగా శిక్షించాలి

బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్

హైదరాబాద్, బతుకమ్మ : కాళేశ్వరం ప్రాజెక్టు సమాచారం అంతా కేసీఆర్, హరీష్ రావు వద్దే ఉందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.  శుక్రవారం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట  ఈటెల రాజేందర్ విచారణ ముగిసింది. అనంతరం ఈటల రాజేందర్ మీడియా చిట్ చాట్ లో మాట్లాడారు.  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ఆర్థిక శాఖ పాత్ర పెద్దగా లేదని చెప్పారు. ఆర్థిక శాఖకు అన్ని విషయాలు తెలియవని పేర్కొన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో తన పాత్రేమి లేదని,  ప్రాజెక్టు రీ డిజైనింగ్ కోసం క్యాబినెట్ సబ్ కమిటీని కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు. దీనికి ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు చైర్మన్ గా ఉన్నారన్నారు. నీటిలభ్యత అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మేడిగడ్డ  వద్ద ఆనకట్ట నిర్మాణం చేపట్టమన్నారు. కమిషన్ ఆర్థికపరమైన అంశాలపై ప్రశ్నలు అడిగిందన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలపై ఆర్థిక శాఖకు ఏమాత్రం సంబంధం లేదని, ఇది పూర్తిగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిందన్నారు. తన కణతపై తుపాకీ పెట్టినా సరే నిజమే మాట్లాడతానన్నారు. కాళేశ్వరం అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకుండా  ప్రాజెక్టు నష్టాలకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీడబ్ల్యూసీ, మహారాష్ట్ర అభ్యంతరాల దృష్ట్యా ప్రాజెక్టు లోకేషన్ ను తమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చినట్లు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ అంశాలన్నీ నీటిపారుదల శాఖ కిందకే వస్తాయని చెప్పారు.

More articles

Latest article