27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

24 కేసులలో నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్న బబ్లూ అరెస్టు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

24 కేసులలో నాన్ బెయిల్ వారెంట్ ఇష్యూ అయి తిరుగుతున్నటువంటి పాత నేరస్థుడిని పట్టుకున్నట్టు నిజామాబాదు సి.సి.ఎస్ ఎసిపి నాగేంద్ర చారి తెలిపారు. కామారెడ్డి జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నటువంటి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా దేగ్లూర్ తాలూకా ఖానాపూర్ గ్రామానికి చెందిన బబ్లు బాలాజీ గైక్వాడ్ అలియాస్ ధన్ల బాబు  అరెస్టు చేసినట్లు తెలిపారు.బబ్లూ కోసం పోలీసులు గత కొన్ని సంవత్సరాలుగా ఎంత గాలించినా చిక్కడం లేదు. బబ్లూ పై ఇప్పటి వరకు 24 వారెంట్లు ఇష్యూ కావడం కాగా నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో నేరాలు చేయడానికి తిరుగుతున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య కు సమాచారం రాగా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం నిజామాబాదు సి.సి.ఎస్ పోలీసులు బబ్లూను చాకచక్యంగా పట్టుకొని కామారెడ్డి పోలీసు వారికి అప్పగించారు. పాత నేరస్తుడుని పట్టుకోవడంలో నిజామాబాద్ సిసిఎస్ ఏసిపి కె. నాగేంద్ర చారి , సీసీఎస్ సీఐ సురేష్ లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య అభినందించారు.

More articles

Latest article