మోర్తాడ్,బతుకమ్మ: మోర్తాడ్ మండలంలోని వడ్యాట్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో అన్ని మోడల్స్ లో కలిపి మొత్తం 52 దరఖాస్తులు వచ్చాయని తాసిల్ ల్దార్ కృష్ణ తెలిపారు. భూ యజమానులకు తమ భూముల విషయంలో ఎటువంటి సందేహాలను తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. కార్యక్రమంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్, రెవిన్యూ సిబ్బంది ముక్రూమ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
