27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

అవకతవకలకు తావులేకుండా చూడాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

 

రుద్రూర్, బతుకమ్మ: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చూడాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం వర్ని మండల కేంద్రంలోని సిసిడి ఫంక్షన్ హల్ లో రుద్రూర్, చందూర్, మోస్రా మండలాల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేశారని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చూడాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, రుద్రూర్ ఎంపిడిఓ భీమ్ రావు, ఉమ్మడి మండలాల మాజీ జడ్పీటీసీ లు నారోజి గంగారాం, హరిదాస్, కాంగ్రెస్ పార్టీ రుద్రూర్ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్తి రాము, ఇందూర్ కార్తిక్, పత్తి లక్ష్మణ్, పార్వతి ప్రవీణ్, లింగం, అధికారులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

It must be ensured that there is no room for irregularities.

More articles

Latest article