అవకతవకలకు తావులేకుండా చూడాలి
ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రుద్రూర్, బతుకమ్మ: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చూడాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం వర్ని మండల కేంద్రంలోని సిసిడి ఫంక్షన్ హల్ లో రుద్రూర్, చందూర్, మోస్రా మండలాల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...