జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో ఆ ఇద్దరిదే హవా
📰 Generate e-Paper Clip
- డీఆర్డీఏలో ఆయన చెప్పిందే వేదం
- చెప్పినట్టు ఉంటేనే సమాఖ్యలో కొనసాగింపు
- ప్రశ్నిస్తే ఉద్వాసన తప్పదు
- జిల్లా సమాఖ్య ఓబీ సభ్యుల ఆందోళనతో విషయం బహిర్గతం
- కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేసినా చర్యలు శూన్యం
నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలో లో గత 14 సంవత్సరాలుగా తిష్ట వేసుకొని కూర్చొన్న జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వ్యవహర శైలిపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కలెక్టరేట్ వద్ద జిల్లా సమాఖ్య ఆర్గనైజింగ్ బాడీ ( ఓబీ) సభ్యుల ఆందోళనతో డీజీఎం, ఏపీడీల వ్యవహారం బట్టబయలైంది. జిల్లాలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది అయినా, గ్రామ స్థాయిలో, మండల సమాఖ్యలో ఎన్నుకొనే మండల సమాఖ్య అధ్యక్షులైన, జిల్లా స్థాయిలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలైన తాను చెప్పిన వారే ఎన్నిక కావాలనేది ఆ అధికారి నైజం. తాను ఒప్పుకుంటేనే ఏదైనా చెల్లుతుందనేలా వ్యవహరిస్తున్నారని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న డీపీఎంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కార్యాలయంలో ఏపీడీగా విధులు నిర్వర్తిస్తున్న కూడా సదరు ఉద్యోగిని అదుపు చేయకపోగా తనకు వంత పాడుతూ ఇరువురు చెప్పిందే జిల్లాలో శాసనం అన్న విధంగా తయారైంది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయం. వారు చేసే కార్యక్రమాలు వారి పై అధికారి అయిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీకి కూడా తెలియజేయకూడదని, లేదంటే చర్యలు వేరేలా ఉంటాయని క్షేత్ర స్థాయి సిబ్బందిని చెప్పకనే చెబుతున్నారు. జిల్లాను వారి గుప్పిట్లో పెట్టుకొని వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని డీఆర్డీఏ ఉద్యోగులే వాపోతున్నారు. సిబ్బంది ఎవరైనా అలా ఎలా అని ప్రశ్నిస్తే వారికి నిత్యం నిర్వహించే విధుల్లో ఏదో ఒక వంక పెట్టి సాధిస్తున్నారు. దీంతో ప్రశ్నించే వారు సైతం వారిద్దరి శరణు కోరుతున్నారు. చివరికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటులో కూడా చేతివాటాన్ని ప్రదర్శిస్తూ సంఘ మహిళలకు అప్పజెప్పాల్సిన మహిళా శక్తి క్యాంటీన్ కూడా తన చెప్పుచేతల్లో ఉండే విధంగా ఏర్పాటు చేసుకొని క్యాంటీన్ నిర్వహణలో కూడా అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. వీటన్నింటిపై జిల్లా సమాఖ్య సభ్యులు నేరుగా కలెక్టర్ కు ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా సదరు ఉద్యోగిపై ఎటువంటి ఎంక్వైరీ చేయకపోవడం పై విమర్శలు వస్తున్నాయి. జిల్లాలోని ఓబి సభ్యులు పిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకపోవడంతో సదరు ఉద్యోగికి ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయని అందుకే చర్యలు లేవని చెబుతున్నారు. జిల్లా అధికారులు చర్యలు తీసుకోకపోతే మళ్లీ ఆందోళనకు కార్యచరణ సిద్ధం చేస్తామని ఓబీ సభ్యులు చెబుతున్నారు.
You cannot print contents of this website.