మెండోరా, బతుకమ్మ: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కార్యాలయంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఎస్ ఈ శ్రీనివాస్ రావు గుప్తా జెండా ఆవిష్కరించారు. అనంతరం మిఠాయిలు పంచి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో ఈ ఈ చక్రపాణి,డి ఈ ఈ లు, గణేష్, గంగా భూషణ్, సుకుమార్, ఏ ఈ ఈ లు, అక్తరుద్దిన్, మామిడి వంశీ, సుశాంత్, శ్యామ్, రిక్కీ సైమన్, మాణిక్యం, పవన్, జూనీడ్, కొండా వంశీ, విణ్యాస్, రాము, సూపర్ఇండెంట్లు గోదావరి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
