28.8 C
Hyderabad
Monday, August 3, 2026

బోధన్ లో తిరంగా ర్యాలీ

Must read

📰 Generate e-Paper Clip

 

బోధన్, బతుకమ్మ:

“మనం సైతం దేశం కోసం” నినాదంతో సిటిజెన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ  బోధన్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ జరిగింది. బోధన్ పట్టణంలోని పెద్ద హనుమాన్ మందిరం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఆదివారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. కాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడికి బదులుగా సైన్యం విజయవంతంగా నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్”ను గర్వంగా స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించారు.

 

Tiranga rally in Bodhan కుల మతాలకతీతంగా, పార్టీలకతీతంగా, పలు స్వచ్ఛంద సంస్థలు త్రివర్ణ పతాకాలతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద గల 101 అడుగుల జాతీయ జెండా వద్ద సభా వేదికను ఏర్పాటు చేసి, ఆపరేషన్ సిందూర్ విజయం పట్ల గల కీర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పసుపులేటి గోపి కిషన్ బోధన్ నియోజకవర్గం బీజేపీ నాయకులు, మాజీ సైనిక ఉద్యోగులు, ఇతర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Tiranga rally in Bodhan

 

More articles

Latest article