బోధన్ లో తిరంగా ర్యాలీ

  బోధన్, బతుకమ్మ: "మనం సైతం దేశం కోసం" నినాదంతో సిటిజెన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ  బోధన్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ జరిగింది. బోధన్ పట్టణంలోని పెద్ద హనుమాన్ మందిరం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఆదివారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. కాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడికి బదులుగా సైన్యం విజయవంతంగా నిర్వహించిన "ఆపరేషన్ సిందూర్"ను గర్వంగా స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించారు.   కుల మతాలకతీతంగా, పార్టీలకతీతంగా, పలు స్వచ్ఛంద సంస్థలు త్రివర్ణ పతాకాలతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద...