23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు గెలుస్తాం

Must read

📰 Generate e-Paper Clip

రేపో మాపో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం

పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌

కొత్తగూడెం, బతుకమ్మ : వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 90 సీట్లు గెలుస్తామని పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు. రేపో మాపో బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని జోస్యం చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ బునియాది ఆదివాసి కార్యకర్తల సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  బీజేపీ, బీఆర్ఎస్‌ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు.  కొందరు బీజేపీ సీనియర్‌ నేతలకు కేసీఆర్‌తో సత్సంబంధాలు ఉన్నాయన్నారు.  రాజాసింగ్‌ చెప్పినట్లు లోక్‌సభ టికెట్లు కూడా కేసీఆర్‌ సూచనలతోనే ఇచ్చారని ఆరోపించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. దేశంలోని అన్ని రకాల వనరులను ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాలనేది కాంగ్రెస్ లక్ష్యమని భట్టి విక్రమార్క అన్నారు. ఎస్సీ, ఎస్టీ బీసీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

More articles

Latest article