వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు గెలుస్తాం
రేపో మాపో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ కొత్తగూడెం, బతుకమ్మ : వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 90 సీట్లు గెలుస్తామని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. రేపో మాపో బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని జోస్యం చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ బునియాది ఆదివాసి కార్యకర్తల సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. కొందరు బీజేపీ సీనియర్ నేతలకు కేసీఆర్‌తో సత్సంబంధాలు ఉన్నాయన్నారు. రాజాసింగ్ చెప్పినట్లు లోక్‌సభ...