26.6 C
Hyderabad
Monday, August 3, 2026

పొగాకు “విముక్తి”తోనే ఆరోగ్యానికి “ముక్తి”

Must read

📰 Generate e-Paper Clip

బిచ్కుంద కోర్టు న్యాయమూర్తి వినీల్ కుమార్

బిచ్కుంద, బతుకమ్మ : పొగాకు నుంచి “దేశానికి”, పొగాకు ఉత్పత్తుల నుంచి “దేహానికి “విముక్తి కలిగినప్పుడే చక్కని ఆరోగ్యం సొంతమవుతుందని  బిచ్కుంద కోర్టు న్యాయమూర్తి వినీల్ కుమార్ అన్నారు.  బిచ్కుంద మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణంలో శనివారం ఏర్పాటు చేసిన మండల న్యాయ సేవా అధికార సంస్థ, బిచ్కుంద న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని మండలాలల్లో నియంత్రించే అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు.   నియోజకవర్గంలో పొగాకు ఉత్పత్తుల నియంత్రణ పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. పొగాకు ఉత్పత్తుల వాడకంతో కలిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో పొగాకు వాడకం, ధూమపానం వల్ల వచ్చే వ్యాధులపై గోడ పత్రికలు, కర పత్రాలు, ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అవగాహన సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. పొగాకు వల్ల బీడీ కార్మికులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉన్న దృష్ట్యా వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించేలా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. పొగాకు నియంత్రణ చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాల్లో పొగత్రాగడం నేరమన్నారు. అలాగే, అన్ని పొగాకు ఉత్పత్తుల ప్రకటనలపై నిషేధ విధించారని తెలిపారు. 18 ఏళ్ల కంటే చిన్న పిల్లలకు వీటిని అమ్మడం నేరమన్నారు. అదేవిధంగా స్కూల్, కళాశాల ఆవరణ నుంచి 100 గజాల దూరం వరకు ఉత్పత్తులను అమ్మడం నేరమని పేర్కొన్నారు. అన్ని పొగాకు ఉత్పత్తులపై చిత్రంతో కూడిన హెచ్చరికను తప్పకుండా ముద్రించాల్సి ఉంటుందన్నారు. ఈ నిబంధనలు అన్ని మండలాల్లో తప్పకుండా అమలు చేయాలని సంబంధిత అధికారులను  బిచ్కుంద కోర్టు న్యాయమూర్తి వినీల్ కుమార్ ఆదేశించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం జరిమానాలు విధించాలన్నారు. ఆయా విషయాలను ప్రజలందరికీ చేరేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. అనంతరం పొగాకు  ఉత్పత్తుల నిర్మూలనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ,బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్ జగడం నరేష్, ఎస్సై మోహన్ రెడ్డి, ఎక్సైజ్ ఎస్సై పి నాగేష్, మరియు న్యాయవాదులు బిచ్కుంద బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రకాష్,  లక్ష్మణ్ రావు, మల్లేశం, మమ్మద్, శివాజీ, రాథోడ్ మనోజ్, బిచ్కుంద మున్సిపాలిటీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

"Liberation" of health comes only with "liberation" of tobacco

More articles

Latest article