పొగాకు “విముక్తి”తోనే ఆరోగ్యానికి “ముక్తి”
బిచ్కుంద కోర్టు న్యాయమూర్తి వినీల్ కుమార్ బిచ్కుంద, బతుకమ్మ : పొగాకు నుంచి "దేశానికి", పొగాకు ఉత్పత్తుల నుంచి "దేహానికి "విముక్తి కలిగినప్పుడే చక్కని ఆరోగ్యం సొంతమవుతుందని బిచ్కుంద కోర్టు న్యాయమూర్తి వినీల్ కుమార్ అన్నారు. బిచ్కుంద మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణంలో శనివారం ఏర్పాటు చేసిన మండల న్యాయ సేవా అధికార సంస్థ, బిచ్కుంద న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని మండలాలల్లో నియంత్రించే అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని సంబంధిత శాఖ అధికారులకు...