25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

నీటి ట్యాంకుల నిర్మాణానికి స్థల పరిశీలన

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణ అభివృద్ధి పనుల్లో భాగంగా, అమ్రుత్ 2.0 (అటల్ మిషన్ ఫర్ రిజువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్) పథకం కింద నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచే కృషి కొనసాగుతోంది. ఈ క్రమంలో, బోధన్ సబ్-కలెక్టర్ వికాస్ మహతో, బోధన్ మండల తహశీల్దార్  విట్టల్, మునిసిపాలిటీ డిప్యూటీ ఇంజనీర్ తో కలిసి ప్రతిపాదిత స్థలాలను పరిశీలించారు. ఈ తనిఖీలో ప్రధానంగా రెండు ప్రదేశాలను పరిశీలించారు.  ప్రెస్ కాలనీ లో 700 కిలోలీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ నీటి ట్యాంక్ నిర్మించేందుకు స్థలం ఎంచుకున్నారు.  అలియాబాగ్ బిటి నగర్ లో ఇక్కడ 600 కిలోలీటర్ల సామర్థ్యం గల నీటి ట్యాంక్ స్థలాన్ని పరిశీలించారు. ఈ ట్యాంకుల నిర్మాణం పూర్తయిన తర్వాత బోధన్ పట్టణంలో తాగునీటి సరఫరా మరింత మెరుగవుతుంది. ప్రజలకు శుభ్రమైన నీరు అందుబాటులోకి వస్తుందనీ అధికారులు విశ్వసిస్తున్నారు.

Site inspection for construction of water tanks

More articles

Latest article