28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఫోన్ ట్యాపింగ్ కేసు :  మూడు రోజుల్లో ప్రభాకర్ రావు స్వదేశానికి రావాలి

Must read

📰 Generate e-Paper Clip

ఇప్పటికిప్పుడు కఠిన చర్యలు తీసుకోవద్దు

సుప్రీంకోర్టు ఆదేశాలు

డిల్లీ, బతుకమ్మ : ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు పిటిషన్ పై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. మూడు రోజుల్లో స్వదేశానికి రావాలని, విచారణకు పూర్తిగా సహకరించాలని సుప్రీం ఆదేశించింది. ఈ మేరకు అండర్ టేకింగ్ ఇవ్వాలని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు కఠిన చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముందస్తు అంశంపై తదుపరి విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.

More articles

Latest article