ఫోన్ ట్యాపింగ్ కేసు :  మూడు రోజుల్లో ప్రభాకర్ రావు స్వదేశానికి రావాలి

ఇప్పటికిప్పుడు కఠిన చర్యలు తీసుకోవద్దు సుప్రీంకోర్టు ఆదేశాలు డిల్లీ, బతుకమ్మ : ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు పిటిషన్ పై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. మూడు రోజుల్లో స్వదేశానికి రావాలని, విచారణకు పూర్తిగా సహకరించాలని సుప్రీం ఆదేశించింది. ఈ మేరకు అండర్ టేకింగ్ ఇవ్వాలని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు కఠిన చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముందస్తు అంశంపై తదుపరి విచారణ చేపడతామని...