26.6 C
Hyderabad
Monday, August 3, 2026

క్లాస్ కి బంక్ కొడితే అమెరికా వీసా రద్దు

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆ దేశంలో ఉంటున్న విదేశీ విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. రోజుకో కొత్త నిబంధన తీసుకొస్తున్న ట్రంప్.. తాజాగా మరో నిబంధన తీసుకొచ్చారు. స్టూడెంట్ వీసాపై ఉంటున్న విద్యార్థులకు క్లాస్ లకు వెళ్లపోయినా, కాలేజీలో చెప్పకుండా కోర్టు మానేసినా వీసాలను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇటీవల 4,700 మందికి పైగా విద్యార్థుల స్టడీ పర్మిట్లను రద్దు చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. వర్సీటీలకు, విద్యార్థులకు సమాచారం ఇవ్వకుండానే వీసా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి.

More articles

Latest article