కడప, బతుకమ్మ : కడపలో టీడీపీ మహిళా నాయకురాలు సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేసింది. ఓ వైపు కడపలో మహానాడు జరుగుతుండగా.. కడప టీడీపీ మాజీ అధ్యక్షురాలు సెల్ టవర్ ఎక్కింది. పార్టీలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ నిరసన తెలిపింది. మాకు ఎటువంటి పదవులు రానివ్వకుండా అడ్డుకోవడమే కాకుండా దళిత వర్గాలను పార్టీకి దూరం చేసే కుట్ర చేస్తున్నాడని ఆరోపలు చేసింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.
