26.2 C
Hyderabad
Monday, August 3, 2026

రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని పసుపు బోర్డు కార్యాలయంగా కేటాయింపు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని వినాయక్ నగర్ లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని జాతీయ పసుపుబోర్డు కార్యాలయానికి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు హామీతో ఎన్నికల్లో పోటీ చేసిన అరవింద్ ప్రధాని మోడీ ద్వారా ఇందూరులో పసుపు బోర్టు ఏర్పాటు హామీ ఇప్పించడంతో పాటు దాని ఏర్పాటులో సక్సెస్ అయ్యారు. ఈ ఏడాది జనవరి మాసంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా ప్రారంభించిన విషయం తెలిసిందే పసుపు బోర్డు చైర్మన్ గా నిజామాబాద్ జిల్లాకు చెందిన పల్లె గంగారెడ్డిని నియమిస్తూ, కార్యదర్శిగా ఐఏఎస్ భవానిని నిమిమించిన విషయం విధితమే. జిల్లా కేంద్రంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బోర్డు కార్యాలయం స్థానంలో శాశ్వత భవనం కోసం నిజామాబాద్ ఎంపీ అరవింద్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిలకు సిఫారసు చేశారు. మూడు నెలలుగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని జాతీయ పసుపు బోర్డు కార్యాలయానికి కేటాయించాలని ప్రభుత్వాన్ని పలుమార్లు  కోరిన విషయం తెలిసిందే. ఎంపీ అరవింద్ క్రుషిలో పసుపు బోర్డు కార్యాలయానికి ఏడాది కాలంగా ఖాళీగా ఉన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పసుపు బోర్డుకు శాశ్వత కార్యాలయం ఏర్పాటు పూర్తి కావడంతో పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని పసుపు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

More articles

Latest article