25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి : టీజీబీవీ

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల నారాయణ విద్యా సంస్థకు ఎలాంటి పర్మిషన్ లేకుండా అడ్మిషన్లు తీసుకుంటున్నారని, విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని టీజీవీబీ ఆధ్వర్యంలో నారాయణ పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీవీబీ నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నారాయణ విద్యా సంస్థకు ఎలాంటి పర్మిషన్ లేదని, పర్మిషన్ ఉందని చెప్పి పాంప్లెంట్ చూయించుకుంటూ విద్యార్థులను పాఠశాలలో చేర్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారిని అడుగుతే నారాయణ విద్యా సంస్థకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పడం జరిగిందని, ఎలాంటి పర్మిషన్ లేకుండా నారాయణ విద్యాసంస్థలో  ఇప్పటివరకు 140 విద్యార్థులను పాఠశాలలో చేర్చుకున్నారని అన్నారు. ఇప్పటికైనా వెంటనే విద్యాశాఖ అధికారులు పాఠశాలను మూసివేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే టీజీవీబీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు.

More articles

Latest article