నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి : టీజీబీవీ
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల నారాయణ విద్యా సంస్థకు ఎలాంటి పర్మిషన్ లేకుండా అడ్మిషన్లు తీసుకుంటున్నారని, విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని టీజీవీబీ ఆధ్వర్యంలో నారాయణ పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీవీబీ నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నారాయణ విద్యా సంస్థకు ఎలాంటి పర్మిషన్ లేదని, పర్మిషన్ ఉందని చెప్పి పాంప్లెంట్ చూయించుకుంటూ విద్యార్థులను పాఠశాలలో చేర్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారిని...