నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: తమ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, వీధి లైట్లు లేకపోవడంతో రాత్రి వేళలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని నగరంలోని అమ్మనగర్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని, కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ ను కోరారు. ఈ మేరకు మంగళవారం వారిని కలిసి వినతిపత్రాలు అందజేశారు.

కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు రెంజర్ల నరేశ్, బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామియాదవ్, అమ్మనగర్ సంఘం అధ్యక్షుడు యెండల కిషన్, ప్రధాన కార్యదర్శి బొబ్బిలి కిషన్, ఉపాధ్యక్షుడు మాడవేడి వినోద్ కుమార్, కోశాధికారి యెండల మహేందర్, దగ్గుల మధుసూదన్, బత్తుల ప్రవీణ్ కుమార్, కత్రోజి రవి తదితరులు పాల్గొన్నారు.
