30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

కన్నప్ప మూవీ హార్డ్ డ్రైవ్‌తో పరారీ

Must read

📰 Generate e-Paper Clip

ఇద్దరిపై కేసు నమోదు

తమ సినిమాకు నష్టం కలిగించడానికి కుట్ర చేస్తున్నారని ఫిర్యాదు

హైదరాబాద్, బతుకమ్మ : కన్నప్ప మూవీకి సంబంధించిన హార్డ్ డ్రైవ్ ను అనుమతి లేకుండా తీసుకెళ్లారని ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిల్మ్ నగర్ పోలీసుల వివరాల ప్రకారం.. కోకాపేట కు చెందిన రెడ్డి విజయ్ కుమార్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ లిమిటెడ్ కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. కన్నప్ప మూవీకి కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ ను ముంబయిలోని హెచ్ఐవీఈ కార్యాలయానికి పంపారు. ఈపార్శిల్ ను ఈనెల 25న ఆఫీస్ బాయ్ రఘు తీసుకున్నాడు. అతను ఈవిషయం ఎవరికి చెప్పకుండా హార్డ్ డ్రైవ్ ను చరిత అనే మహిళకు ఇచ్చాడు. అప్పటి నుంచి వారు పరారీలో ఉన్నారు.  కొంతమంది పెద్దవాళ్లు తమ సినిమాకు నష్టం కలిగించడానికి కుట్ర చేస్తున్నారని, వారిద్దరిని పట్టుకొని చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article